loader

భాష కోసం ప్రాణాలిచ్చిన చరిత్ర మాది-ఆడుకోవద్దు-కమల్ హాసన్ హెచ్చరిక..!

తమిళనాడులో బలవంతంగా హిందీ అమలు వివాదం నేపథ్యంలో మక్కల్ మయ్యం నీది పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కేంద్రానికి హెచ్చరికలు చేశారు. తమిళులకు భాష కోసం ప్రాణాలిచ్చిన చరిత్ర ఉందని, దాంతో ఆడుకోవద్దన్నారు. తమిళులకు, పిల్లలకు కూడా వారికి ఏ భాష అవసరమో తెలుసన్నారరు. వారికి అవసరమైన భాషను ఎంచుకునే జ్ఞానం వారికి ఉందని కమల్ హాసన్ తేల్చిచెప్పేశారు.

రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం (24) నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాలకు వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారని సమాచారం.

మళ్లీ బీఈడీ, ఎంఈడీ ఒక ఏడాదే.. వచ్చే ఏడాది నుంచే అమలు!

బీఈడీ, ఎంఈడీలు కొన్నేళ్ల కిందట ఏడాది కోర్సులుగానే ఉండేవి. వాటిని రెండేళ్ల కాలపరిమితితో మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. మళ్లీ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులను కాల వ్యవధిని ఏడాదికి తగ్గించాలని ప్రతిపాదించింది. ఎన్‌సీటీఈ వెబ్‌సైట్‌లో ఉంచిన ముసాయిదా పాలసీపై మార్చి 8 వరకు అభిప్రాయాలను స్వీకరించనుంది. బీఈడీ, ఎంఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రామాణిక సబ్జెక్ట్‌, ఆప్టిట్యూట్‌ టెస్ట్ నిర్వహించనుందని ప్రముఖ […]

ఛాంపియన్స్‌ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్‌ . . .భారత్ Vs పాకిస్తాన్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ దుబాయ్ వేదికగా హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. పాకిస్థాన్‌తో తలపడనుండగా ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ నేరుగా సెమీస్‌కు చేరనుంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌ను ఓడించింది పాకిస్థాన్‌. ఈ మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ దగ్గర సహాయక చర్యలు ముమ్మరం, రంగంలోకి‘ఇంజినీర్‌ టాస్క్‌ఫోర్స్‌’

నాగర్‌ కర్నూల్‌ జిల్లా దోమలపెంట వద్ద ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో పైకప్పు కూలిన ఘటనలో 8మంది చిక్కుకు పోయారు. వారిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయకచర్యలను వేగవంతం చేసింది. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌లో సాయం చేసేందుకు సైన్యానికి చెందిన ‘ఇంజినీర్‌ టాస్క్‌ఫోర్స్‌ (ETF)’ రంగంలోకి దిగనుంది.. నిపుణులైన ఇంజినీర్లతో కూడిన బృందం.. వైద్యసామగ్రి, అవసరమైన సహాయ పరికరాలతో సిద్ధమైంది.

పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) రెండో రౌండ్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దేశంలోని 730కి పైగా జిల్లాల్లో ఒక లక్ష మందికి పైగా యువతకు పెద్ద కంపెనీలలో ఇంటర్న్‌షిప్ అవకాశం లభిస్తుంది. దేశంలోని టాప్‌-500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ pminternship.mca.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ సమయంలో ప్రతి నెలా రూ. 5,000, పూర్తయిన తర్వాత ఒకేసారి రూ. 6,000 లభిస్తుంది. అప్లికేషన్‌ పంపడానికి ఆఖరు తేదీ మార్చి 12, 2025.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON