ఇండియాలో జాబ్ ఓపెనింగ్స్ ప్రకటించిన టెస్లా!
అమెరికాకు చెందిన ప్రముఖ టెస్లా కంపెనీ ఇండియాలో ఉద్యోగ నియామకాలు చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అయిన టెస్లా.. ఎప్పట్నుంచో ఇండియన్ మార్కెట్‌లోకి ప్రవేశించాలని చూస్తోంది. కొన్ని ట్యాక్స్‌ల సమస్యల కారణంగా ఇంత కాలం భారత్‌లోకి టెస్లా రాక సాధ్యం కాలేదు. కానీ, తాజాగా అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీతో, ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ఉద్యోగ ప్రకటన రావడం ఆసక్తికరంగా మారింది.