రోహిత్ సేనపై కాసుల వర్షం.. టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా..
టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి రోహిత్ సేన రికార్డు స్థాయిలో రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఈ ఛాంపియన్ ప్రదర్శనకు గానూ టీమ్ ఇండియా ఐసీసీ నుంచి మొత్తం రూ.22.76 కోట్లు ప్రైజ్ మనీగా అందుకుంది. రోహిత్ సేనకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.125 కోట్లు బహుమతిగా ప్రకటించింది బీసీసీఐ.