loader

రోహిత్ వల్ల కానిది చేసి చూపించిన శ్రేయస్.. నో డౌట్ మనోడే భవిష్యత్తు కెప్టెన్!

కోల్‌కతా ఛాంపియన్ అవ్వడానికి శ్రేయాస్ అయ్యర్ కారణమంటూ నిజమైన క్రికెట్ లవర్స్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఫైనల్ మ్యాచులో అతను తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణం. శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ మార్పు చేసిన ప్రతిసారీ కూడా సన్‌రైజర్స్ వికెట్ కోల్పోయింది.అంతేకాకుండా ఫీల్డింగ్ మార్పుల విషయంలో కూడా తన కెప్టెన్సీ మార్క్ చూపించాడు.

HSRP: మీ వెహికల్‌కు హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్‌ ఆర్డర్ చేయాలా? ప్రాసెస్ ఇదే..

దోపిడీ, కిడ్నాప్‌, వాహనాల చోరీ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు వాహనాలకు నంబర్ ప్లేట్స్ మారుస్తుంటారు. ఇలాంటి నేరాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్‌లను (HSRP) ప్రవేశపెట్టింది.ట్యాంపరింగ్‌ జరిగే వీలు లేకుండా, భద్రతను మెరుగుపరచడానికి ఈ ప్లేట్లలో 3D హోలోగ్రామ్, లేజర్‌తో ఎంబెడ్ చేసిన సీరియల్ నంబర్ వంటి స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి.

అరసవల్లిలో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు

నిజ రూపదర్శనం చేసుకున్న భక్తులు సంతృప్తి నిండిన కళ్లతో కనిపించారు. ఆదివారం అర్థరాత్రి నుంచి సూర్య నారాయణస్వామి జయంతి వేడుకలకు అశేష భక్తులు చేరుకుంటున్నారు. స్వామి అర్చన కన్నుల పండువగా జరగడంతో చూసి తరించారు.శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో రథసప్తమి అంగరంగ వైభవంగా జరిగింది.

ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చేసిన గుంటూరు కారం..

ఈ సినిమా ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోవడంతో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. గుంటూరు కారం మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమా ఫిబ్రవరి 09 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళీ, హిందీ భాషాల్లో అందుబాటులో ఉంది.థియేటర్స్‌లో పెద్దగా ఆకట్టుకోని ఈ సినిమా ఓటీటీలో ఏమాత్రం ఆకట్టుకోనుందో చూడాలి

ఉచిత కరెంట్.. తెలంగాణ ప్రభుత్వానికి షాక్.. !

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్… అధికారంలోకి రాకముందు ఆరు గ్యారంటీలను ప్రజలకు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. మరో రెండు స్కీంలను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతుంది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో గృహజ్యోతి పథకం ఒకటి. ఇందులో భాగంగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించనుంది. అయితే ఈ క్రమంలో… రేవంత్ రెడ్డి సర్కార్‌కు షాక్ తగిలింది.

రజినీ లాల్ సలామ్.. ధనుష్ ట్వీట్‌ వైరల్

రజినీకాంత్ ప్రముఖ పాత్రలో నటించిన లాల్ సలామ్ సినిమా ఫిబ్రవరి 9న థియేటర్లోకి రాబోతోంది. ఈ మూవీ తెలుగులోనూ రిలీజ్ అవుతోంది. కానీ ఎటువంటి బజ్ క్రియేట్ అవ్వలేదు. నెట్టింట్లో లాల్ సలామ్ గురించి ఎక్కువగా చర్చలు జరగడం లేదు.ఈ చిత్రాన్ని ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ సినిమా నేడు విడుదల కాబట్టి.. ధనుష్ ఓ ట్వీట్ వేశాడు. ఈ రోజు నుంచి లాల్ సలామ్ సింపుల్ ఓ ట్వీట్ వేసి తన […]

Inter Exams: ఇంటర్ పరీక్షలు.. విద్యార్థులకు అలర్ట్..

ఫిబ్రవరి 11 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు , మార్చి 1 నుంచి 15 వరకు ఇంట‌ర్మీడియ‌ట్ థియరీ ప‌రీక్ష‌లు జరగనున్నాయని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సరం థియరి ప‌రీక్ష‌లకు 40,873 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంకు 41,806 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు.అంతేకాకుండా విద్యార్థుల సందేహాల నివృత్తికి ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.జిల్లా వ్యాప్తంగా జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సందేహాలు ఉంటే నివృత్తి కొరకు కంట్రోల్ రూం […]

రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి దంపతులు ..త్వరలో కాంగ్రెస్ లోకి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇతర పార్టీల నుంచి అధికార పార్టీలోకి చేరాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఇందులో భాగంగానే పలువురు బీఆర్ఎస్ నేతలు, ఇతర పార్టీలకు చెందిన నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు.అయితే భేటీ తర్వాత మర్యాదపూర్వకంగానే కలిశామని చెబుతున్నప్పటికి రాజకీయ ప్రయోజనాల కోసమే అనేది వినిపిస్తున్న మాట. తాజాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కీలక నేత ,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో పాటు […]

ISRO : మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో .. GSLV-F14

నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రయోగానికి సిద్దమైంది. వాతావరణానికి సంబంధించిన ప్రతి క్షణం సమాచారాన్ని అందించే వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్-3డిఎస్‌ను ఇస్రో గురువారం ప్రయోగించనుంది.ఈ ఉపగ్రహం సహాయంతో మెరుగైన వాతావరణ సూచన అందుబాటులోకి రావడంతో పాటు విపత్తు హెచ్చరికలకు కూడా ఉపకరిస్తుంది. ఇస్రో ఈ ఉపగ్రహాన్ని ఫిబ్రవరి 17న ప్రయోగించనుంది. ఈ ఉపగ్రహం జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ F14 (GSLV F14)లో ప్రయోగించబడుతుంది.

PHONE NUMBER

+91 7569298753

EMAIL

admin@news4short.com

LOCATION

12-9-27/16
Prakashnagar,station road
beside Oxford School,
NARASARAOPET-522601-AP

DOWNLOAD APP

FOLLOW US ON