
14 ఏళ్ల పాటు సాగిన ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి భారీ ఊరట లభించింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా ప్రకటించడంతో.. 12 ఏళ్ల పాటు తాను ఎదుర్కొన్న కష్టాలకు న్యాయం జరిగిందని సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై తనకు ఉన్న నమ్మకం నిజమైందని సబిత పేర్కొన్నారు.