
జపాన్‌లో తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. రూ.11,062 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి పలు కంపెనీలు ముందుకొచ్చాయి. హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఎన్టీటీ డేటా, నెయిసాలు సంయుక్తంగా రూ. 10,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాగా, రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ రూ.562 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. ఈ క్లస్టర్ ఏర్పా టు చేసేందుకు త్రైపాక్షిక ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి.
టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ పెట్టుబడుల ఒప్పందం కుదిరింది.