
క్యాథలిక్‌ల అత్యున్నత మత గురువుగా ఉంటే పోప్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. అమెరికాకు చెందిన కార్డినల్ రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రీవోస్ట్… 267వ పోప్‌గా ఎన్నికయ్యారు. ఆయన త్వరలో ప్రపంచంలోని 1.4 బిలియన్ కాథలిక్కుల కొత్త నాయకుడిగా సెయింట్ పీటర్స్ బసిలికా బాల్కనీలోకి అడుగుపెట్టనున్నారు. ఇల్లినాయిస్‌లోని చికాగోకు చెందిన 69 ఏళ్ల ప్రీవోస్ట్… తదుపరి పోప్ కావడంతో ఆయన పేరును లియో XIV గా ఎంచుకున్నారు. ఇకపై పోప్ లియో XIV గా పిలవనున్నారు.