
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్పీఎఫ్ లేదా ఎన్ఎస్జీ భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన తరపు న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి.. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రతివాదులను ఆదేశించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఐబీ డైరెక్టర్, సీఆర్‌పీఎఫ్ డీజీ, ఎన్‌ఎస్‌జీ డీజీ, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి కోర్టు నోటీసులు జారీ చేసింది.