
మిస్ వరల్డ్ 2025 పోటీల ఏర్పాట్లను సమీక్షించేందుకు మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి హైదరాబాద్ కు చేరుకున్నారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ కోసం జరుగుతున్న ఏర్పాట్లతో పాటు, మిస్ వరల్డ్ కాంటెండర్స్ పర్యటించే పలు ప్రాంతాల లో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించనున్నారు. మిస్ వరల్డ్ ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై జూలియా మోర్లి సంబంధిత ఏజెన్సీలు, పలు విభాగాల అధికారులు, ప్రతినిధులతో సమీక్షించనున్నారు.