
స్పేడెక్స్ శాటిలైట్ల డీ-డాకింగ్(విడదీత) గురువారం విజయవంతంగా జరిగిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. దీని ద్వారా చంద్రుడిపై భవిష్యత్తు పరిశోధనలకు(చంద్రయాన్-4), మానవ సహి త వ్యోమనౌక ప్రయోగానికి, సొంత అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందని ఆయన తెలిపారు. తాజా డీ డాకింగ్ ద్వారా వృత్తాకార కక్ష్యలో డాకింగ్, అన్ డాకింగ్‌ను విజయవంతంగా నిర్వహించే సామర్థ్యాన్ని తాము సంపాదించామని భారత అంతరిక్ష పరిశోధ సంస్థ (ఇస్రో) తెలిపింది.