
ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రయత్నాలు మొదలుపెట్టారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, పాకిస్థాన్ ప్రధాన మంత్రి మహమ్మద్ షెహబాజ్ షరీఫ్‌తో విడివిడిగా మాట్లాడారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ దుశ్చర్యను మార్కో రూబియోకు జైశంకర్ వివరించారు. సరిహద్దుల్లో తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలని పాకిస్థాన్ ప్రధానికి ఆయన సూచించారు. ఇరు దేశాల మధ్య చర్చలకు మద్దతిస్తామని ఆయన తెలిపారు.