
హాలీవుడ్ లో అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ అయిన మెట్ గాలాలో పాల్గొన్న తొలి భారతీయ నటుడిగా షారుఖ్ ఖాన్ గుర్తింపు పొందారు. మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో జరిగిన రెడ్ కార్పెట్ పై నడకకు ముందు, న్యూయార్క్ నగరంలోని మాండరిన్ ఓరియంటల్ హోటల్ బయట తన అభిమానులను కలిశారు. అభిమానులతో కరచాలనం చేస్తూ ముద్దులు పెడుతున్న కింగ్ ఖాన్ దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. ఈ పిక్స్ ను మరింతగా వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటోస్ కు రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.