
ఇమ్మిగ్రేషన్ స్క్రీనింగ్‌ను కట్టుదిట్టం చేయాలన్న ఉద్దేశంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన 14161 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో భాగంగా అమెరికా వీసా, గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులు ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులతోపాటు తమ సోషల్ మీడియా ఖాతాల సమాచారాన్ని కూడా ఇప్పుడు అందచేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్(డీహెచ్‌ఎస్) మార్చి 5న ఓ నోటీసులో వెల్లడించింది.