
ప్రయాణ సౌకర్యంలో వందేభారత్ రైళ్లు ఇతర సాధారణ రైళ్లతో పోలిస్తే ఎంతో మెరుగు. అయితే, ఈ రైల్లో తాజాగా ప్రయాణించిన ఓ యూకే మహిళ ఇందులోని సౌకర్యాలను చూసి ఆశ్చర్యపోయింది. ఈ ప్రయాణం అద్భుతమంటూ ప్రశంసలు కురిపించింది. దాదాపు 8 గంటల పాటు రైల్లో ప్రయాణించిన ఆమె ఆ విశేషాలను వీడియో రూపంలో నెట్టింట పంచుకుంది. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. వందేభారత్ ప్రయాణాన్ని మెచ్చుకుంటూ ఆమె షేర్ చేసిన వీడియోకు భారీగా వ్యూ్స్ వచ్చాయి.