
రైల్వే శాఖ వెయిటింగ్ టిక్కెట్లపై ప్రయాణించే నియమాలను మార్చింది. ఇప్పుడు వెయిటింగ్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులు జర్నీ చేస్తే వారు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇదివరకు వెయిటింగ్ టిక్కెట్లతో ప్రయాణించేవారు స్లీపర్, ఏసీ కోచ్‌లలో ఎక్కడానికి, ప్రయాణించడానికి భారతీయ రైల్వే అవకాశం ఇచ్చింది. వెయిటింగ్ లిస్ట్ టికెట్‌పై AC కోచ్‌లో ప్రయాణిస్తే రూ.440, స్లీపర్ కోచ్‌లో ప్రయాణిస్తే.. రూ. 250 జరిమానాతో మీరు తరువాత స్టేషన్ వరకు ఛార్జీని కట్టాలి.