
రామ్ చరణ్ తాజాగా లండన్‌కు బయల్దేరాడు. తన మైనపు విగ్రహావిష్కరణలో రామ్ చరణ్ సందడి చేయబోతోన్నాడు. గత ఏడాది మేడం టుస్సాడ్స్ టీం రామ్ చరణ్, రైమ్ ఇద్దరి కొలతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ నుంచి ప్రభాస్, మహేష్ బాబు, బన్నీ ఇలా అందరి మైనపు విగ్రహాలను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రామ్ చరణ్ మైనపు విగ్రహం కూడా ఉండబోతోంది. లండన్‌లో మే 9న ఈ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతోన్నట్టుగా తెలుస్తోంది.