
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రమంతా దోచుకో.. పంచుకో.. తినుకో.. నడుస్తుందని అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా స్కాంలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా నడుస్తోందని ఆరోపణలు చేశారు. స్థానిక ఉప ఎన్నికల్లో కూటమి అరాచకాలకు పాల్పడిందని వైఎస్ జగన్ విమర్శించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా రాక్షస పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.