
పాకిస్తాన్ ఓ విఫల రాజ్యమని ఫరూక్ అబ్దుల్లా తాజాగా వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం ఏర్పడనంతవరకూ భారత్ తో ఆ దేశం సంబంధాలు మెరుగుపడవని ఆయన తెలిపారు. యుద్ధభూమిలో ఒకరినొకరు ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాయని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఈ యుద్ధం జరగకూడదని ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పహల్గాం దాడి వెనుక ఉన్నవారిని, వారి సూత్రధారులను పట్టుకోవడానికి ఏదో ఒక మార్గం కనుక్కోవాలన్నారు. యుద్ధం ఆపడంలో ప్రపంచం ఎంతవరకు విజయం సాధిస్తుందో, అది దేవుడికే తెలుసన్నారు.