
పశ్చిమ్ బెంగాల్లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా మొదలైన నిరసనలతో ముర్షిదాబాద్ జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన హింసాత్మక ఆందోళనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో కలకత్తా హైకోర్టు ఘాటుగా స్పందించింది. రాజ్యాంగ న్యాయస్థానాలు ప్రేక్షకపాత్ర పోషించలేవని నొక్కిచెప్పిన హైకోర్టు.. కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశించింది. ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉందని, వారి ప్రాణాలను, ఆస్తులను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని హైకోర్టు స్పష్టం చేసింది.