
క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పేద ముస్లింలను ఆర్థికంగా పైకి తీసుకొస్తాం అని చెప్పుకొచ్చారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను సంరక్షిస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.