
మహిళా దినోత్సవం అనేది కార్మిక ఉద్యమం నుంచి పుట్టిందట.. ఎంతోమంది మహిళలు కూడా తమ హక్కుల కోసం చాలా పోరాటాలు చేశారట. వాటి ఫలితంగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా ఏర్పడిందట.. 1908లో అమెరికాలో న్యూయార్కులో మొదట 15,000 మంది మహిళలు తమ పని గంటలను సైతం తగ్గించాలంటూ డిమాండ్ చేశారట. అలాగే వారికి ఓటు హక్కును కూడా కల్పించాలంటూ పురుషులతో సమానంగా జీతాలు ఇవ్వాలనే విధంగా హెచ్చరించారట. 1975లో మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.