
బీఈడీ, ఎంఈడీలు కొన్నేళ్ల కిందట ఏడాది కోర్సులుగానే ఉండేవి. వాటిని రెండేళ్ల కాలపరిమితితో మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. మళ్లీ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులను కాల వ్యవధిని ఏడాదికి తగ్గించాలని ప్రతిపాదించింది. ఎన్సీటీఈ వెబ్సైట్లో ఉంచిన ముసాయిదా పాలసీపై మార్చి 8 వరకు అభిప్రాయాలను స్వీకరించనుంది. బీఈడీ, ఎంఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రామాణిక సబ్జెక్ట్, ఆప్టిట్యూట్ టెస్ట్ నిర్వహించనుందని ప్రముఖ ఆంగ్ల పత్రిక ఓ కథనం వెలువరించింది.