
జనాభా దగ్గరి నుంచి టెక్నాలజీ వరకు అన్నింట్లోనూ దూకుడుతో ముందుకెళ్లే చైనా మరో విషయంలోనూ సత్తా చాటుతోంది. ఏకంగా ఆసియాలోనే టాప్ స్థానంలో నిలబడింది. బంగారం నిల్వలు. గోల్డ్ అంటే ఇండియా, ఇండియా అంటే గోల్డ్ అనేంతలా మన సంప్రదాయాల్లో పెనవేసుకుపోయింది. అయితే బంగారం నిల్వలు అధికంగా ఉన్న దేశం ఏది అంటే చైనా అనే తేలింది. చైనా 2,279.6 టన్నుల బంగారు నిల్వలతో ఆసియాలో అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంలో ఆరవ అతిపెద్ద బంగారు నిల్వలు కలిగిన దేశంగా చైనా తన ఆర్థిక బలాన్ని కొనసాగిస్తోంది.