
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ప్రముఖ నటి రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను రాజకీయాల్లో సరిపోనని భావిస్తున్నానని రేణు దేశాయ్ అన్నారు. రాజకీయాలు తన జీవితంలో భాగమని భావించానని.. కానీ ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని వాపోయారు. తాను విధిరాతను ఎదిరించి ముందుకు సాగుతున్నానని చెప్పారు. ప్రజలకు సేవ చేయడంలో తనకు సంతోషం కలుగుతుందని వ్యాఖ్యానించారు. అకీరాకు సినిమాల్లోకి రావాలని ఉందని చెబితే.. స్వయంగా తానే ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఆ విషయం అందరికీ చెప్తానని వెల్లడించారు.