
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబం ఇండియాలో పర్యటిస్తున్న సమయంలోనే ఉగ్రవాదులు పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడ్డారు వాన్స్ ఒక ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. “భారత్ తనదైన ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లాలి. కానీ.. అది ప్రాంతీయ యుద్ధానికి దారి తియ్యకూడదు. పాకిస్థాన్ కూడా తమ భూభాగంలో ఉన్న ఉగ్రవాదుల్ని అరికట్టడానికి భారత్‌కి సహకరించాలి” అన్నారు. ఇలా అనడం ద్వారా.. భారత్‌కి అమెరికా ఫుల్ సపోర్ట్ ఇచ్చినట్లైంది. ఇక ఇప్పుడు భారత్.. పాకిస్థాన్ గడ్డమీద ఉగ్రవాదుల్ని లేపేయాలి అనుకుంటే.. అమెరికా అండదండలు ఉన్నట్లే భావించచ్చు.