
పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలు. 2026 గణతంత్ర వేడుకల వేళ ప్రకటించే పద్మ అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. పద్మ అవార్డులకు నామినేషన్లకు చివరి తేదీ జూలై 31. పద్మ అవార్డులకు నామినేషన్లు/సిఫార్సులు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ (https://awards.gov.in)లో ఆన్లైన్లో మాత్రమే స్వీకరించబడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైద్యులు, శాస్త్రవేత్తలను మినహాయించి… పీఎస్యూలలో పనిచేసే వారు ప్రభుత్వ ఉద్యోగులు పద్మ అవార్డులకు అర్హులు కాదు.