
తన దేశభక్తి గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఏప్రిల్ 25న ఆయన ఓ ప్రకటన విడుదల చేశాడు. అర్షద్ నదీమ్‌కు ఫోన్ చేసినందుకు తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని, దీనిని ఎప్పటికీ సహించని చెప్పుకొచ్చాడు. పహల్గామ్ దాడికి ముందే అర్షద్‌కు ఆహ్వానం పంపినట్లు నీరజ్ స్పష్టం చేశాడు. నేను చాలా సంవత్సరాలుగా నా దేశానికి సగర్వంగా సేవ చేస్తున్నాను. ఈ రోజు నా సమగ్రతను ప్రశ్నిస్తున్నారు. నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకునే వారికి నేను వివరించాల్సి రావడం నాకు బాధగా ఉంది.