
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో నీళ్ళు, నిధులు, నియామకాలకు సంబంధించి బలమైన పునాదులు వేయగలిగామని, అదే ప్రగతిని ఆర్బీఐ తన నివేదికలో తెలియజేసిందని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి,
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అన్ని రంగాలల్లో పురోగామిగా అతితక్కువ కాలంలో ఎదిగిందని లెక్కలతో సహా ఆర్బీఐనే చెప్పిందని గుర్తు చేశారు.