
ఏపీలో కూడా భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఎఫెక్ట్ కనిపిస్తోంది. ముఖ్యంగా తిరుమలలో సెక్యూరిటీని పెంచారు.. కొండపై ఏరియా డామినేషన్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా 130 మంది ఆక్టోపస్, పోలీసు, నిఘా మరియు భద్రత విభాగం, బాంబ్, స్క్వాడ్ బృందాల అధికారులు, సిబ్బంది నాలుగు బృందాలుగా విడిపోయి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్-పాక్ వార్ నేపథ్యంలో భక్తుల్లో ధైర్యాన్ని నింపేలా ముందస్తు జాగ్రత్తగా ఏరియా డామినేషన్ నిర్వహించి తిరుమలలో శ్రీవారి ఆలయం, కాటేజీలు, బస్టాండ్ వంటి రద్దీ ప్రాతాల్లో తనిఖీలు చేశారు.