
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన.. అధిక టారిఫ్ల కారణంగా చైనా కంపెనీలు భారతదేశంలో భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపుతున్నాయి. రిలయన్స్.. హయర్ ఇండియాలో వాటా కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోంది. షాంఘై హైలీ.. ఓల్టాస్తో చర్చలు జరుపుతోంది. చాలా చైనా కంపెనీలు మైనారిటీ వాటాకు కూడా అంగీకరిస్తున్నాయి. భారతీయ సంస్థలతో జట్టుకట్టి, ఇక్కడి నుంచే తమ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్కు తరలించేందుకు చైనా దిగ్గజాలు..భారతీయ కంపెనీలలో భాగస్వామ్యం కోసం పోటీ పడుతున్నాయి.