
తమిళనాడుకు చెందిన 56 మంది విద్యార్థులు జమ్ము కశ్మీర్‌లో చిక్కుకుపోయారు. తమిళనాడుకు చెందిన 52 మంది విద్యార్థులు జమ్ము కశ్మీర్‌లోని పలు విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే ఇటీవలే తమిళనాడుకు రాష్ట్రానికి చెందిన మరో నలుగురు విద్యార్థులు విజ్ఞాన యాత్ర కోసం జమ్ము కశ్మీర్ వెళ్లారు. దీంతో అప్రమత్తమైన తమిళనాడు సర్కారు వారిని క్షేమంగా ఇంటికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే విమాన సర్వీసులు నిలిచిపోవడంంతో.. 56 మంది విద్యార్థులను రోడ్డు మార్గంలో తిరిగి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.