
అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎప్పుడో ఒకసారి మాత్రమే సందర్భాన్ని బట్టి మాత్రమే ప్రజల్లోకి వచ్చే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. ఇప్పుడు మరోసారి జనాల్లోకి ఘనంగా వచ్చేందుకు సిద్ధమయ్యారు. వరంగల్‌లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఎర్రవెల్లి నివాసంలో కీలక నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఏప్రిల్ 27వ తేదీకి 25 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రాజతోత్సవాలను నిర్వహించాలని కేసీఆర్ సంకల్పించారు.