
ప్రస్తుతం చెన్నై- విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు విజయవాడలో ఎక్కువసేపు ఉంటుంది. ఈ రైలును విజయవాడలో ఎక్కువసేపు ఉంచడం వల్ల మిగిలిన రైళ్లకు ఇబ్బందిగా మారుతుంది. నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ, కేంద్రమంత్రి కావడంతో ఆయన నరసాపురం వరకు వందే భారత్ ను పొడిగిస్తే బాగుంటుంది అన్న ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఏలూరు మీదుగా వందే భారత్ నడుస్తుందని, నరసాపురం వైపు కూడా వందే భారత్ నడిస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన రైల్వే శాఖ మంత్రి దృష్టికి