
చట్టాల సవరణలతో రాజ్యాంగంలో కల్పించిన హక్కులను బీజేపీ ప్రభుత్వం హరిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి చాడవెంకట్‌రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనుసృ్మతి తిరోగమన భావజాలాన్ని అంబేద్కర్ వ్యతిరేకించారని తెలిపారు. సామాజిక సంసర్త, న్యాయవేత్త, రచయిత, బహుభాషావేత్త, ఆలోచనాపరుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు