
ఖోఖో ప్రపంచ కప్ 2025 లో భారత జట్టు దుమ్మురేపుతోంది. పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టు కూడా టాప్ గేర్ లో ముందుకు సాగుతోంది. అద్భుతమైన ఆటతో ప్రత్యర్థి జట్లకు షాకిస్తూ ఇప్పటికు ఒక్క ఓటమి కూడా లేకుండా భారత మహిళ ఖోఖో జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. జనవరి 17, న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళ జట్టు సూపర్ విక్టరీ అందుకుంది. ఈ విజయంతో టీమిండియా మహిళల జట్టు సెమీఫైనల్‌కు తమ స్థానాన్ని బుక్ చేసుకుంది.