
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. వాట్సాప్ ద్వారా బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. కారులో బాంబు పెట్టి పేల్చాస్తామని ఆగంతకుడు బెదిరించాడు. దీనిపై ముంబైలోని వర్లిలోని ట్రాన్స్ పోర్ట్ విభాగానికి మెసేజ్ వచ్చింది. దీంతో వర్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. సల్మాన్ ఖాన్కు సెక్యూరిటీని మరింత టైట్ చేశారు అధికారులు. సల్మాన్ ఖాన్కు ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా భద్రతను మరింత కట్టు దిట్టం చేశారు పోలీసులు.