
కాశ్మీర్ లోయలో ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 87 పర్యాటక ప్రాంతాల్లో 48 ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించింది. మూసివేసిన 48 ప్రాంతాల్లో ప్రస్తుతం టూరిస్టులను అనుమతించడం లేదు. సంబంధిత ప్రాంతాలలో భద్రతా బలగాలు మోహరింపజేసి పూర్తి స్థాయి భద్రత కల్పించిన తరువాత మాత్రమే వాటిని తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. టూరిస్టుల కోసం ఇప్పటికీ ఓపెన్ ఉన్న ఇతర ప్రాంతాలలో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.