
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త తెలిపింది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు వర్గాల పేద విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందించనుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.25 లక్షలు, బీసీ, మైనారిటీలకు రూ.20 లక్షలు, ఈబీసీ, కాపు విద్యార్థులకు రూ.15 లక్షలు ఆర్థిక సహాయం అందనుంది. క్యూఎస్ ర్యాంకింగ్‌లో టాప్-250 యూనివర్సిటీల్లో సీటు పొందిన విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది.