
ఆంధ్రప్రదేశ్ రోడ్లపై కొత్త విద్యుత్ బస్సులు పరుగులు తీయనున్నాయి.. కేంద్రం ఏపీఎస్ ఆర్టీసీకి 750 బస్సుల్ని పంపిస్తుందని తెలిపారు అధికారులు. ఈ బస్సుల్ని ఏపీలోని వివిధ నగరాలకు రానున్నాయి.. విశాఖపట్నం, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, కర్నూలు, కాకినాడ, రాజమహేంద్రవరం, కడప, అనంతపురం, తిరుపతి, మంగళగిరికి బస్సుల్ని కేటాయించనున్నట్లు తెలుస్తోంది. విశాఖ నగరానికి నాలుగు విడతల్లో మొత్తం 200 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. మొదటి విడతలో 50 బస్సులు త్వరలో వస్తున్నట్లు చెబుతున్నారు.