
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్ లోని నవ్సారీ జిల్లాలో నిర్వహించబోయే ఉమెన్స్ డే వేడుకలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి మహిళా పోలీసులే భద్రత కల్పించనుండటం విశేషం.హెలిప్యాడ్ నుంచి వేదిక వరకూ ప్రధాని మోదీ భద్రతా ఏర్పాట్లను మహిళా పోలీసులు మాత్రమే నిర్వహిస్తారని వెల్లడించారు. ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి కేవలం మహిళా పోలీసులే పహరా కాయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం