
కమల్ హాసన్ విక్రమ్ తరువాత ట్రెండ్ మార్చాడు. చకచకా ప్రాజెక్టుల్ని పట్టాలెక్కిస్తున్నాడు. ఇక ఇప్పుడు మణిరత్నంతో కలిసి చాలా ఏళ్ల తరువాత కమల్ హాసన్ థగ్ లైఫ్ అనే చిత్రాన్ని చేశాడు. అసలు మణిరత్నం నుంచి సరైన హిట్టు వచ్చి చాలా కాలమే అవుతోంది. తాను యాక్టర్ కంటే ముందు ఆడియెన్‌ను అని, థగ్ లైఫ్‌తో కొత్త ఎక్స్ పీరియెన్స్ వస్తుందని, సినిమా అద్భుతంగా ఉందని, ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కమల్ హాసన్ నమ్మకంగా చెప్పుకొచ్చాడు.