
2009లో వచ్చిన ఆధార్ (Aadhaar) ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ బేస్డ్ ఐడెంటిటీ ప్రోగ్రామ్. దేశంలో ప్రతి పౌరుడికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించడమే దీని లక్ష్యం. 2023 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 136.65 కోట్ల ఆధార్ కార్డులు జారీ అయ్యాయి. దాదాపు 97 శాతం జనాభాకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆధార్ ఆధారిత సర్వీసులు క్రమంగా పెరుగుతున్నాయి జనవరిలో ఏకంగా 284 కోట్ల ఆధార్ బేస్డ్ ట్రాన్సాక్షన్లు జరిగాయి.