
పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ చనిపోయి కనిపించడం తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. ప్రవీణ్‌ది రోడ్డు ప్రమాదమని అనుకున్నప్పటికీ పాస్టర్లు మాత్రం ఇది హత్యగా అనుమానిస్తున్నారు. కొవ్వూరు టోల్ గేట్ సమీపంలో ప్రవీణ్ టూవీలర్‌పై వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ లభించింది. టోల్ గేట్ నుంచి 11.31 నిమిషాలకు బయల్దేరిన తర్వాత ప్రమాదం జరిగిన 11. 43 నిమిషాల మధ్య ఏం జరిగిందనేది ఇప్పుడు కేసులో కీలకం. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ఎస్సైలతో కూడిన టీం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.