
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో పాన్ ఇండియా రేంజ్ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. బన్నీ న్యూలుక్‌లో అదుర్స్ అనిపించారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నల్లటి అథ్లెటిజర్ డ్రెస్ ధరించి కనిపించారు. అంతే కాకుండా రూ.1.2 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లె వాచ్, మెడలో గొలుసుతో లగ్జరీ లుక్‌లో అదరగొట్టారు. అట్లీ న్యూ మూవీలో లుక్ ఇదేనంటూ నెట్టింట కామెంట్స్ మొదలయ్యాయి.