
మల్లేశం, 8 ఏ.ఎం, మెట్రో చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజ్ ఆర్ నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘23’తో వస్తున్నారు. 1991 సుండూరు ఊచకోత, 1993 చిలకలూరిపేట బస్సు దహనం, 1997 జూబ్లీహిల్స్ కార్ బాంబు పేలుడు.. ఈ మూడు సామూహిక హత్యల నేపధ్యంలో 23 టీజర్ ఆద్యంతం అద్భుతంగా కొనసాగింది. ఈ సినిమాని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది.