
పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లోని ప్రసిద్ధ స్వర్ణ దేవాలయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇనుప రాడ్‌తో దాడి చేయడంతో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఓ వ్యక్తి పరిస్థితి ఆందోళన కరంగా ఉందని, ఆ వ్యక్తికి ఐసీయూలో చికిత్స జరుగుతోందని వైద్యులు చెప్పారు. నిందితుడికి మరొకరు సహకరించారని.. దాడికి ముందు వారిద్దరూ ఆలయంలో రెక్కీ నిర్వహించారని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడిని హర్యానాకు చెందిన జుల్ఫాన్‌గా గుర్తించారు