
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లలో చాలా మంది సామాజిక బాధ్యతను మర్చిపోతున్నారు. డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. బెట్టింగ్, లోన్ యాప్‌లను అడ్డగోలుగా ప్రమోట్ చేస్తూ తమను గుడ్డిగా ఫాలో అవుతున్నవారిని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. అలాంటి ఇన్‌ఫ్లూయెన్సర్లలో కొందరు ఇప్పటికే కటకటాలు లెక్కిస్తుండటంతో మిగిలిన వారు ఇరకాటంలో పడ్డారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల వల్ల ఇప్పటికే బెట్టింగ్ యాప్స్‌లో మోసపోయినవారు బయటికి రావాలి. ఆ యాప్‌లలో బెట్టింగులు పెట్టేలా మిమ్మల్ని పురిగొల్పిన ఇన్‌ఫ్లూయెన్సర్లపై సమీప పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టాలి.