
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన పోస్టుపై చట్టప్రకారం తాము ముందుకు వెళతామని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫొటోను షేర్ చేసినందుకు పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయడంపై ఆయన స్పందించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని మంత్రి తెలిపారు.