
చార్టెర్డ్ అకౌంటెంట్ (CA) పరీక్షలకు సంబంధించి ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) కీలక ప్రకటన వెలువరించింది. గత ఏడాది మార్చిలో సీఏ ఇంటర్, ఫౌండేషన్ కోర్సు పరీక్షలను ఏడాదికి మూడుసార్లు నిర్వహించనున్నట్లు ప్రకటించిన ఐసీఏఐ.. 2025 నుంచి సీఏ ఫైనల్ పరీక్షల్ని కూడా ఏడాదికి మూడుసార్లు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సీఏ ఫైనల్ పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.