
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై ప్రీ ప్రైమరీ తరగతులు కూడా ప్రారంభించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం సర్కారు బడుల్లో ఒకటో తరగతి నుంచి మాత్రమే చదువుకునే అవకాశం ఉంది. అంగన్‌వాడీ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ నిర్వహించేవారు. ప్రభుత్వ పాఠశాలల్లో శిశు విద్యను ప్రారంభించాలని నిర్ణయించింది. త్వరలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించి, పిల్లలకు ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు.